‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ పలు మీడియా సంస్థలతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూల్లో పవన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో ఓ ఛానల్ వారు పవన్ కళ్యాణ్ తో చిన్న రాపిడ్ ఫైర్ నిర్వహించారు. అందులో పవన్ కళ్యాణ్ తన ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
దీపికా పదుకోనె లేదా అలియా భట్ లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు పవన్ కళ్యాణ్ ‘ఇద్దరూ’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. అటు తర్వాత అలియా భట్, దీపికా పదుకోనె, కృతి సనన్ ఈ ముగ్గురిలో ఇష్టమైన హీరోయిన్ అంటే ఎవరి పేరు చెబుతారు అంటూ మళ్ళీ యాంకర్ ప్రశ్నించింది. అందుకు పవన్ కళ్యాణ్ ‘కృతి సనన్’ అంటూ సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాత కృతి సనన్, కంగనా రనౌత్ లో ఎవరు ఇష్టం అంటూ మళ్ళీ యాంకర్ ప్రశ్నించగా అందుకు ‘కంగనా’ పేరు చెప్పాడు పవన్. ఇందిరా గాంధీ పాత్రను ఆమె బాగా చేసిందని, ఆమె నటన తనకు నచ్చుతుంది అని పవన్ తెలియజేశాడు. తర్వాత కంగనా, శ్రీదేవి.. ఇద్దరిలో ఫేవరెట్ అంటే.. ‘శ్రీదేవి’ అంటూ తేల్చి చెప్పేశారు పవన్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకు మించి వెళ్లి చివరికి శ్రీదేవి , సావిత్రి ఇద్దరిలో ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని అడిగుంటే కచ్చితంగా సావిత్రి పేరు చెప్పేవారు పవన్.