పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నెల ట్రాక్ రికార్డ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఓజి’ సినిమా ఈరోజు అనగా సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కి డై-హార్డ్ ఫ్యాన్ అయినటువంటి సుజీత్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. డీవీవీ దానయ్య నిర్మించారు. గ్లింప్స్ తోనే భారీ హైప్ సొంతం చేసుకుంది ఈ సినిమా. 3 ఏళ్ళ నుండి ఈ గ్లింప్స్ ను పవన్ అభిమానులు రోజూ రిపీటెడ్ గా చూస్తూ వచ్చారు. అందువల్ల సినిమాకి పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా బోలెడంత బజ్ వచ్చేసింది.

Pawan Kalyan

ఈ రోజుల్లో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకి అయినా బజ్ తీసుకురావడానికి మేకర్స్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేని పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమాకి ఈ రేంజ్ బజ్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.ఇదిలా ఉంటే.. కొంతమంది హీరోల సినిమాలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాళ్ళకి కొన్ని రిలీజ్ డేట్లు లేదా రిలీజ్ మంత్..లు వంటివి కలిసొస్తాయి.

అలా పవన్ కళ్యాణ్ కి సెప్టెంబర్ నెల కొంత వరకు బాగానే కలిసొచ్చింది. ఎలా అంటే.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒకే ఒక్క ఇండస్ట్రీ హిట్ సినిమా ఉంది. అదే ‘అత్తారింటికి దారేది’ చిత్రం. ఈ సినిమా సెప్టెంబర్లోనే రిలీజ్ అయ్యింది. 2013 సెప్టెంబర్ 27న ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. అలా అని ఈ నెలలో పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన సినిమాలన్నీ హిట్టేనా అంటే.. కాదు. 2004 సెప్టెంబర్ 10న ‘గుడుంబా శంకర్’ సినిమా వచ్చింది.

అది యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. తర్వాత 2010లో సెప్టెంబర్ 10నే ‘కొమరం పులి’ వచ్చింది. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక 12 ఏళ్ళ తర్వాత సెప్టెంబర్ నెలలో ‘ఓజి’ రిలీజ్ అవుతుంది. ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

 ‘ఓజి’ పై చిరు రియాక్షన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus