మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఓ కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. ఆయన గాంధీజీని హత్య చేసిన గాడ్సే గురించి అనుకూల వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన గాడ్సే కూడా దేశభక్తుడే అని సర్టిఫై చేశాడు. ఈ వ్యాఖ్యలు గాంధీవాదులను మరియు దేశ భక్తులను కొంచెం హర్ట్ చేశాయి. సాధారణ నెటిజెన్స్ సైతం నాగబాబు కామెంట్స్ కి గట్టి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అసలు అసందర్భంగా నాగబాబు ఈ టాపిక్ ఎందుకు తెరపైకి తెచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు.
ఆయన ఈ వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తలనొప్పిగా మారాయని తెలుస్తుంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అవుతుంది. ఇప్పటికే కొందరు నాగబాబుపై కేసులు పెట్టడం జరిగింది. నాగబాబు కూడా జనసేన పార్టీలో సభ్యుడిగా ఉంటున్నాడు. ఆయన గత ఎన్నికలలో ఎంపీ గా పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఆలోచన లేకుండా చేసే కామెంట్స్ ఆ పార్టీ క్రెడిబిలిటీని దెబ్బతీశే ఆస్కారం ఉంది.
మరి ఈ విషయంలో పవన్ నాగబాబు ని సమర్ధించాలో వ్యతిరేకించాలో అర్థం కాని పరిస్థితి. ఇక నాగబాబు తాజా వ్యాఖ్యలు అటు తీవ్ర అసహనానికి కారణం అయినట్లు తెలుస్తుంది. పవన్ బహిరంగంగా ఎటువంటి అభిప్రాయం వెళ్లబుచ్చనప్పటికీ, వ్యక్తిగతంగా ఈ ఇలాంటి సున్నిత అంశాలపై మాట్లాడవద్దని సూచించారట. నాగబాబు తీరులో కొన్నాళ్లుగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన ఎక్కవగా అటెంషన్ కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది.
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్