టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్, సాయితేజ్ కలిసి నటించిన బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచింది. సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలైంది. అయితే ఈ సినిమా రిజల్ట్ గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలు బ్రో సినిమా గురించి చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు సూచనలు చేశారు. పాలిటిక్స్ ను పాలిటిక్స్ లా చూడాలని పాలిటిక్స్ లోకి సినిమాను తీసుకొనిరావద్దని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి మంచి చేయాలనుకునే అభిమానులు సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
నాతో మాట్లాడి పదవి ఇస్తామంటే అలాంటి వాళ్లను దూరం పెట్టాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు పవన్ కు క్రేజ్ పెరుగుతోంది.
ఓజీ సినిమా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం.