Pawan Kalyan: నేను మొరటు మనిషిని.. నాకు తెలిసిందిదే.. పవన్ కామెంట్స్ వైరల్!
- July 26, 2023 / 02:10 PM ISTByFilmy Focus
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉండగా పవన్ స్పీచ్ లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయనే సంగతి తెలిసిందే. యూత్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతర స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ జీవితం తాను కోరుకున్న జీవితం కాదని ఆయన అన్నారు. బ్రో సినిమా కోసం సముద్రఖని తెలుగు నేర్చుకున్నారని కాబట్టి నేను కూడా తమిళం నేర్చుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అన్నయ్య చిరంజీవి నువ్వు హీరో అవుతావా అని అడగగా ఆ ప్రశ్నకు నాకు భయం వేసిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. చిన్న జాబ్ చేసుకుంటూ పొలంలో పని చేయాలని నాకు ఉండేదని ఆయన పేర్కొన్నారు.

వైజాగ్ జగదాంబ సెంటర్ లో బస్ పై సీన్ షూట్ చేస్తున్న సమయంలో నలుగురిలో నటించలేక ఏడుపొచ్చిందని పవన్ వెల్లడించారు. మా వదిన సురేఖకు ఫోన్ చేసి నువ్వెందుకు సినిమాల్లోని పంపించావ్ అని అడిగానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోజు మా వదిన చేసిన తప్పే ఈరోజు నన్నిలా నిలబెట్టిందని ఆయన కామెంట్లు చేశారు. మా వదిన చేసిన ద్రోహం గురించి మాటల్లో చెప్పలేనని పవన్ సరదాగా అన్నారు.

నేను (Pawan Kalyan) మొరటు మనిషినని త్రికరణ శుద్ధితో పని చేయడం మాత్రమే నాకు తెలుసని ఆయన పేర్కొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హిందీ, సంస్కృతంలో కూడా పట్టు ఉందని త్రివిక్రమ్ ను ప్రేరణగా తీసుకుని యంగ్ రైటర్స్ రావాలని పవన్ వెల్లడించారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లాంటివిజయాలు సాధించాలని ఉందని అయితే పూర్తిగా నటన వైపు మనస్సు పెట్టడం లేదని పవన్ తెలిపారు.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!
















