జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారనే సంగతి తెలిసిందే. కొంతకాలం పాటు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలతోనే బిజీగా ఉంటారని తెలుస్తోంది. పవన్ సినిమా షూటింగ్ లలో మళ్లీ పాల్గొనడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయితీ రాజ్ శాఖ అప్పుల్లో ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అప్పుల్లో ఉన్న సమయంలో తాను జీతం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నా సినీ కెరీర్ లో 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ట్యాక్స్ రూపంలో చెల్లించానని ఆయన తెలిపారు. 100 కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించినా నా అడిటర్ తో 90 నిమిషాలు కూడా కూర్చోలేదని పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) , ఓజీ (OG Movie) సినిమాలకు చెరో 25 రోజులు డేట్స్ కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
మరో మూడు నెలల వరకు పవన్ సినిమాలకు డేట్లు కేటాయించే అవకాశం లేదని సమాచారం అందుతోంది. పవన్ రీఎంట్రీ సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతోంది. పవన్ సినిమాలలో కొన్ని సినిమాలకు ఇప్పటికే డిజిటల్ హక్కులకు సంబంధించిన డీల్స్ పూర్తయ్యాయి. ఆ సినిమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన సమయానికే విడుదల కావాల్సి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ కెరీర్ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.