పవన్ ను చూసి చాలా మంది హీరోలు నేర్చుకోవాలట..!

‘తన పార్టీని బలోపేతం చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు.. ఇక సినిమాలు చెయ్యడు అని’.. అని చాలా మంది భావించారు. నిజానికి పవన్ కూడా ఆ మాట పదే పదే చెప్పాడు. దీంతో అభిమానులు సైతం అసలు వదిలేసుకున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా స్టార్ట్ అయ్యింది అనే నిజం నమ్మడానికి కూడా చాలా సమయం పట్టింది. కానీ లక్ష్మీ నారాయణ పార్టీ నుండీ నిష్క్రమిస్తూ లేక విడుదల చేసినప్పుడు.. నాకు సినిమాలే ఆధారం అని పవన్ వెంటనే మరో లేక విడుదల చెయ్యడంతో అందరూ నిజమే అని నమ్మారు. ప్రస్తుతం పవన్ రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకటి ‘వకీల్ సాబ్’.. మరొకటి క్రిష్ డైరెక్షన్లో చేస్తోన్న ‘విరూపాక్షి'(‘పవన్ 27’ వర్కింగ్ టైటిల్) అవ్వడం విశేషం.

Allu Arjun Following Jr NTR

వీటితో పాటు ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణంలో.. హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో చిత్రం చేస్తున్నాడు పవన్. ఇది 28 వ చిత్రం. ఇక ఈ మూడు సినిమాలు చేస్తూనే… పూరిజగన్నాథ్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ‘జన గణ మన’ .. పూరి డ్రీం ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మహేష్ తో చెయ్యాలని పూరి ట్రై చేసాడు.. కానీ ఇప్పుడు పవన్ తో చేయబోతున్నట్టు తెలుస్తుంది. అతి తక్కువ టైంలోనే ఈ చిత్రం పూర్తిచేయబోతున్నాడట పూరి. ఇక అటు తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో తన 30వ చిత్రం చేయడానికి కూడా రెడీ అవుతున్నాడట. ఈ ప్రాజెక్ట్ ను ‘గీత ఆర్ట్స్’ పై అల్లు అరవింద్ నిర్మిస్తారని తెలుస్తుంది. ఏదో రెండు సినిమాలు చేసాక లైట్ తీసుకుంటాడులే అని కామెంట్స్ చేసిన వారికి… పవన్ ఇలా వరుస సినిమాలు చేయడం గట్టి సమాధానం చెప్పడమే అని చెప్పాలి.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus