Pawan Kalyan: నిర్మాతలైతే వచ్చే సంవత్సరం సినిమా కచ్చితం అంటున్నారు

  • April 21, 2021 / 02:51 PM IST

ఓవైపు చిరంజీవి, మరోవైపు ప్రభాస్‌, ఇంకోవైపు పవన్‌ కల్యాణ్‌. టాలీవుడ్‌లో వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ వెళ్లిపోతున్న అగ్ర హీరోలు. చేతిలో ఒక సినిమా ఉంటే అది అయ్యేదాకా తర్వాతి సినిమా ఊసెత్తని స్టార్‌ హీరోలు.. ఈ మధ్య ఒకదాని తర్వాత ఇంకొకటి అంటూ వరుసగా సినిమాలు ఓకే చేసుకుంటూ పోతున్నారు. ఇది చూస్తుంటే అభిమానులకు ఆనందం, నిర్మాతలకు సంబరం, బాక్సీఫీసుకు సందడి. పై ముగ్గురిలో ఆఖరాయన మరో సినిమా ఓకే చేశాడని తాజా టాక్‌.

పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌, ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా హరీశ్‌ శంకర్‌ డైరక్షన్‌లో ఒకటి, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మరొకటి ఒప్పుకున్నాడు. వీటితోపాటు జేబీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద ఓ సినిమా చేయడానికి పవన్‌ అంగీకరించాడని టాక్‌. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు, ఎప్పుడు ప్రారంభం లాంటి సమాచారం మాత్రం లేదు. అయితే 2022లో కచ్చితంగా పవన్‌తో సినిమా చేస్తామని జేబీ ఎంటర్‌టైన్మెంట్స్‌ చెబుతోంది.

సాయిధరమ్‌ తేజ్‌తో ‘రిపబ్లిక్‌’ సినిమా తీస్తున్న సంస్థే జేబీ ఎంటర్‌టైన్మెంట్స్‌. ఈ నిర్మాణ సంస్థ ఇండస్ట్రీకి కొత్తేం కాదు. తెలుగు చిత్ర సీమకు బాగా పరిచయం ఉన్న భగవాన్‌, పుల్లారావు కలసి కొత్తగా ఏర్పాటు చేసిన బ్యానర్‌ ఇది. ‘బాలాజీ ఆర్ట్‌ మీడియా’ పేరుతో ఓ బ్యానర్‌ పెట్టి గతంల కొన్ని హిట్ సినిమాలు తీశారు. అయితే ‘రెబల్‌’ లాంటి డిజాస్టర్‌లు తీసి చేతులు కాల్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు ‘రిపబ్లిక్‌’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సినిమా త్వరలో విడుదల కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా వాయిదా వేయనున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus