రీరిలీజ్‌ సినిమా అంటే.. పవన్‌ సినిమానే అనేలా… సందడి చూశారా?

  • December 31, 2022 / 07:26 PM IST

సినిమాల రీరిలీజ్‌ ట్రెండ్‌ ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. ప్రతి నెలా ఏదో ఒక సినిమా వస్తూనే ఉంది. స్టార్‌ హీరోల హిట్‌ సినిమాల్ని ఆ నిర్మాతలు లేదంటే కొందరు ఔత్సాహికులు రీ రిలీజ్‌ చేస్తున్నారు. ‘పోకిరి’ సినిమాతో మొదలైన ఈ రీరిలీజ్‌ సందడిని.. పవన్‌ కల్యాణ్‌ ఓవర్‌టేక్‌ చేసేశాడా? ఏమో ‘ఖుషి’ రీరిలీజ్‌కి వచ్చిన స్పందన చూస్తే అవును అనాలనే అనిపిస్తోంది. కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంగా.. ఈ సినిమాను డిసెంబరు 31న విడుదల చేసిన విషయం తెలిసిందే. జనవరి 1న కూడా సినిమా వేస్తున్నారు అనుకోండి.

‘ఖుషి’ రీరిలీజ్‌ అయిన థియేటర్ల దగ్గర ఫ్యాన్స్‌ సందడి చూస్తుంటే.. ఇదేదో ఫస్ట్‌ టైమ్‌ రిలీజ్‌ అవుతుందా అనిపిస్తుంది. అంతలా వచ్చారు థియేటర్లకు జనాలు. థియేటర్ల వద్దకు భారీగా చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ అభిమానులు టపాసులు కాల్చుతూ.. డ్యాన్స్‌లు చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్క్రీన్‌పై వింటేజ్‌ పవన్‌ కల్యాణ్‌ని చూసి పేపర్లు ఎగురవేశారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ ప్రేక్షకులతో కలసి ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయడం విశేషం.

హైదరాబాద్‌లోని దేవి 70ఎంఎం థియేటర్‌లో అకీరా ఈ సినిమా చూడటం విశేషం. అకీరా సినిమా చూస్తూ, స్క్రీన్‌పై తండ్రి కనిపించగానే సగటు అభిమాని లాగే ఫొటోలు తీసి భలే ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ఖుషి’ చిత్రానికి సాంకేతికంగా హంగులు జోడించి విడుదల చేశారు. 4K రిజల్యూషన్‌, 5.1 డాల్బీ ఆడియోతో ‘ఖుషి’ సినిమాను ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో ‘ఖుషి’కి ఉన్న ఆదరణ వేరు. పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో మళ్లీ ఆ స్థాయి హిట్‌, ఆ స్థాయి రెస్పాన్స్‌ మళ్లీ రాదు అని అనడంలో అతిశయోక్తి లేదు. పాటలు, ఫైట్లు, పవన్‌ మేనరిజమ్స్‌, క్లైమాక్స్‌.. ఇలా ఏది చూసినా గూస్‌ బంప్స్‌ పక్కా అంటుంటారు అప్పటి జనాలు. ఇప్పుడు మరోసారి ఆ మజా థియేటర్లలో ఎంజాయ్‌ చేశాం అని ఫ్యాన్స్‌ ట్వీట్లు చేస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus