స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఏపీలో 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2014 సంవత్సరంలో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక విధంగా పవన్ కళ్యాణ్ కారణమని చెప్పవచ్చు. అయితే 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు నిరాశే మిగిలింది. పోటీ చేసిన రెండు స్థానాల నుంచి పవన్ ఓడిపోగా జనసేనకు కేవలం ఒక సీటు మాత్రమే దక్కింది.
అయితే రిపబ్లివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్ల ద్వారా పవన్ కళ్యాణ్ వార్తల్లో నిలిచారు. పవన్ చేసిన కామెంట్లకు మీడియా కవరేజీ సైతం బాగానే లభించింది. పవన్ కామెంట్లకు వైసీపీ నాయకులు రియాక్ట్ కావడంతో పవన్ ను సపోర్ట్ చేసేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. పవన్ కు వైసీపీ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పవన్ స్థాయి పెరిగింది. మరోవైపు పవన్ ను ఎదుర్కోవడంలో వైసీపీ నేతలు ఫెయిల్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు ట్విట్టర్ లో పవన్ యాక్టివ్ కావడంతో పాటు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో జనసైనికులు సంతోషిస్తున్నారు. పవన్ ఇదే దూకుడును ప్రదర్శిస్తే మాత్రం 2024 ఎన్నికల్లో జనసేనకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. పవన్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా మరింత యాక్టివ్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గ్రామాలలో పవన్ పార్టీని బలోపేతం చేస్తే మాత్రం 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి భారీస్థాయిలో సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది.