పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా ఉందని డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ఆరోపించారు. ఈయన పవన్ గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కృష్ణాజిల్లా థియేటర్ రైట్స్ 4.50 కోట్లు వెచ్చించి కొనుగోలుచేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, డిజాస్టర్ గా నిలిచింది. దీంతో పంపిణీదారులు ఘోరంగా నష్టపోయారు. వారిలో సంపత్ కుమార్ కుమార్ కూడా ఉన్నారు. తనకి సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల 2 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ “కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటామని చెప్పారు. వారికోసమే కాటమరాయుడు చేస్తున్నానని, దానిని మాకే ఇస్తామని వివరించారు. అందుకోసం ఏడాదిగా ఎదురుచూసాము. ఇప్పుడు నిర్మాత శరత్ మరార్ మాకు ఇవ్వమని చెబుతున్నారు” అని వివరించారు.
“పవన్ మంచివారు, అభిమానుల బాగుకోరుకునే వ్యక్తి.. అతను ఇవ్వమని చెప్పినా అతని మేనేజర్ శ్రీనివాస్ స్వలాభం కోసం నష్టపోయిన వారికి కాటమరాయుడు రైట్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు” అని వెల్లడించారు. పవన్ ని కలవడానికి పోతే .. అపాయింట్మెంట్ ఇవ్వకుండా అతని చుట్టూ ఉన్న మాఫియా అడ్డుకుంటోందని సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా బాధ పవన్ కి చేరాలనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాను, పవన్ ని కించపరచడానికి కాదు” అని డిస్ట్రిబ్యూటర్ స్పష్టం చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.