‘పవన్’ టార్గెట్ ‘మహేష్’

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ లో ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరిది స్పెషల్ ప్లేస్ అనే చెప్పాలి. వీరిద్దరిలో ఎవరు నంబర్ వన్ అని అడిగితే మా హీరో అంటే…మా హీరో అంటూ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్కెట్ విషయంలో ప్రిన్స్ మహేష్ తో పోలిస్తే పవన్ కాస్త వెనకానే ఉన్నాడు అని తెలుస్తుంది.

అయితే ఈ విషయం పక్కన పెడితే…ఇప్పటివరకూ ఎప్పుడు మహేష్, పవన్ ఇద్దరూ ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోలేదు, కానీ తాజాగా పవన్ కల్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ మహేష్ ను టార్గెట్ చేశాడు అన్న విమర్శ టాలీవుడ్ లో కోడై కూస్తుంది. ఇంతకీ పవన్ ఏమన్నాడు అంటే….మీరు యాడ్స్ చేయరా…..యాడ్స్ లో నటించడం ఇష్టం లేదా అని విలేఖరి అడిగిన మాటకు పవన్ స్పందిస్తూ….

బ్రాండిగ్ చేయడానికి నా మనసు అంగీకరించదు. దానికి కారణం కూడా చాలా డిఫరెంట్ గా చెప్పాడు పవన్….అదేమిటంటే…తాను వాడని వస్తువుల గురించి తాను ఎలా చెబుతానని.. అలా చెప్పడం తనకు మనస్కరించదని అంటున్నారు. ఐతే యాడ్స్ ద్వారా సంపాదించాలని లేదా అంటే.. అలా సంపాదిస్తే బావుంటుందని తనకూ అనిపింస్తుందట.

ఎప్పుడంటే..అవతలి వారు బాగా సంపాదిస్తున్నప్పు అంటూ కొంచెం వెటకారంగా నవ్వాడు. ఇక ఈ కామెంట్స్ విన్న మహేష్ ఫాన్స్ హర్ట్ అయినట్లు సమాచారం. పవన్ చెప్పిన తీరు చూస్తే…అతని మాటలు తమ హీరోని ఉద్దేశించినట్లు ఉన్నాయి అని, దీనిపై గరం గరంగా ఉన్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. అయినా పవన్ ఏదో తన మనసులోని మాటలు చెబితే దానికి నెగేటివ్ టచ్ ఇవ్వడం ఎంతవరకూ కరెక్ట్ చెప్పండి.

Pawan Kalyan Satires on Mahesh Babu - Filmy Focus

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus