Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ లెక్క మారిందట.. ఆ సినిమాకే ప్రాధాన్యత!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త్వరలో మళ్లీ వరుసగా సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. మరి పవన్ కళ్యాణ్ తన సినిమాలలో మొదట ఏ సినిమాకు ప్రాధాన్యత ఇవ్వనున్నారనే ప్రశ్నకు సంబంధించి ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. హరిహర వీరమల్లుకు (Hari Hara Veera Mallu) పవన్ కళ్యాణ్ మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏఎం రత్నం  (AM Ratnam) జనసేన పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని హరిహర వీరమల్లుకే డేట్స్ మొదట ఇస్తున్నారని సమాచారం అందుతోంది.

ఓజీ మూవీ (OG Movie) నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడవ్వాల్సి ఉందని అందువల్లే ఆ సినిమా ఆలస్యం అవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఓజీ, హరిహర వీరమల్లు పూర్తైన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ కు (Ustaad Bhagat Singh) పవన్ డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే కీలక పనులు పూర్తి చేసి ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పవన్ పూర్తి చేయనున్నారు. ఎన్నికల ఫలితాల ఆధారంగా పవన్ సినిమాలకు సంబంధించి నిర్ణయాన్ని మార్చుకోనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పూర్తి ప్రణాళికలు తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. పవన్ కొత్త సినిమాలను మాత్రం ఇప్పట్లో ప్రకటించే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రకటించిన మూడు సినిమాలన్నీ వేర్వేరు జానర్లలో తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాలను వేగంగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ మాత్రం కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ బ్రో సినిమా తర్వాత మరో సినిమాను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రెండు రంగాలలో సక్సెస్ కావాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లను పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus