Balakrishna Controversy: బాలయ్య కాళ్ల దగ్గర మద్యం బాటిల్ వెనుక ఇంత కథ ఉందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ కొన్నిరోజుల గ్యాప్ లోనే సత్యభామ(Satyabhama)  , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari)  సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరై ఈ సినిమాలపై అంచనాలు పెంచారు. అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో బాలయ్య (Nandamuri Balakrishna)  కూర్చున్న కుర్చీ దగ్గర మద్యం బాటిల్ ఉందని ఒక ఫోటో వైరల్ అయింది. వైరల్ అయిన ఫోటో విషయంలో బాలయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బాలయ్య మద్యం సేవించారంటూ కొన్ని వార్తలు వ్యక్తమయ్యాయి.

అయితే ఈ వార్తలు మరీ ఎక్కువ కావడంతో నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)  వైరల్ అయిన వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైరల్ అయిన ఫోటోలు గ్రాఫిక్స్ ఫోటోలు అని ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్య కాళ్ల దగ్గర ఏముందో మాకు తెలుసని నాగవంశీ వెల్లడించారు. ఈవెంట్ ను నిర్వహించింది సైతం తామేనని ఆయన పేర్కొన్నారు. ఎవరో కావాలని సీజీ వర్క్ చేసి మద్యం బాటిల్ ఉందనే విధంగా చేశారని నాగవంశీ అన్నారు.

నాగవంశీ క్లారిటీతో ఇకనైనా వైరల్ అవుతున్న వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. వరుస విజయాలతో జోరుమీదున్న విశ్వక్ సేన్ (Vishwak Sen)  తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది విశ్వక్ సేన్, నేహాశెట్టి (Neha Shetty) ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్టున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నా దర్శకుడు కృష్ణచైతన్య (Krishna Chaitanya)  మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు. నేహాశెట్టి, అంజలి (Anjali) ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకోగా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus