కొన్ని రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నారు. కాటమరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే ప్రభుత్వాల తప్పిదాన్నిప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య ఉద్దానం కిడ్నీ భాదితుల కోసం ఉద్యమించిన పవన్ ఇప్పుడు చేనేత కార్మికుల కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో సోమవారం చేనేత సత్యాగ్రహం.. ఐక్య గర్జన మొదలయింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై చేనేత సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ సత్యాగ్రహం జరుగుతోంది.
ఈ వేదికపై సాయంత్రం పవన కల్యాణ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించనున్నారు. చేనేత కార్మికుల బాగు కోసం తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడనున్నారు. జనసేనాని ఏ అంశాలను ప్రస్తావిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.