గబ్బర్ సింగ్ మూవీ విడుదలై 8ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేశారు. పవన్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమాను గుర్తు చేసుకుంటూ వారు రచ్చ రచ్చ చేయడం జరిగింది. మరో విశేషం ఏమిటంటే ఇన్నేళ్లకు గబ్బర్ సింగ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, విరూపాక్ష సినిమాలలో నటిస్తుండగా వీటి అనంతరం ఆ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. హరీష్ ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ చేయడంతో పాటు, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ మలయాళ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమై హీరోయిన్ గా మారిన మానస రాధాకృష్ణన్ ఈ సినిమాలో పవన్ కి జంటగా నటించనుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

21ఏళ్ల ఈ యంగ్ బ్యూటీ క్రాస్ రోడ్స్, ఊరియాడి వంటి హిట్ చిత్రాలలో నటించింది. ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కొద్దీ రోజులుగా మీడియా మాధ్యమాలలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక దీనిపై క్లారిటీ రావాలంటే డైరెక్టర్ హరీష్ శంకర్ నోరు విప్పాల్సిందే. హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని పవన్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
