పవన్ కళ్యాణ్ ప్రసంగం వినేందుకు విదేశీ విద్యార్థుల ఉత్సాహం

  • January 17, 2017 / 05:58 AM IST

కొంతమంది మాటల్లో పవర్ ఉంటుంది. వారి ప్రసంగం ఎంతోమందిలో చైతన్యాన్ని రగిలిస్తుంది. అటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆ విషయాన్నీ తెలుగువారు మాత్రమే కాదు విదేశాలకు చెందిన విద్యా వేత్తలు గ్రహించారు. తమ విద్యార్థులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రసంగాన్ని వినిపించాలని ఆశపడ్డారు. అమెరికా హార్వర్డ్‌ యూనివర్సిటీలో నిర్వహించే సభల్లో మాట్లాడమని పవర్ స్టార్ ని  ఆహ్వానించింది. తన మాట పదిమందికి ఉపయోగపడుతుంటే కాదనలేకపోయారు. హాజరవుతానని మాటిచ్చారు. దీంతో నిర్వాహకులు సంబరపడి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

“ఫిబ్రవరిలో 11 , 12 తేదీల్లో నిర్వహించే హార్వర్డ్‌లోని ఇండియా కాన్ఫరెన్స్ 2017లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు” అని తెలిపారు. హార్వడ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ కెనడీ స్కూల్‌లు సంయుక్తంగా ప్రతియేటా  నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, వినోద రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ వేత్తలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఇదివరకు విశ్వనటుడు కమల్ హాసన్ ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సారి ఆ అవకాశం పవన్ కి దక్కడం విశేషం. ఈ కాన్ఫరెన్స్ లో మాధవన్ కూడా ప్రసంగించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus