టాలీవుడ్ లో చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు…అయితే వారిలో ఎక్కువ శాతం ఫెయిల్ అయిన ధాకలాలె కనిపిస్తూ నున్నాయి. అంతెందుకు సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవినే ప్రజలు తిరస్కరించిన సంధర్భం మనం మన కళ్ళారా చూశాం. ఇదిలా ఉంటే అన్ని అనుభవలాను ఎదురుగా చూసినప్పటికీ పవన్ కల్యాణ్ ‘జనసేన’ పేరుతో రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్దం అవుతున్నాడు…2019లో పోటీ చేస్తా అంటూ తెలిపారు…ఇంతవరకూ బాగానే ఉంది….మరి సినిమాల సంగతి ఏంటి?? సినిమాలకు పవన్ గుడ్ బై చెప్తారా?? అభిమానులు ఏమయిపోవాలి? అన్న ఆలోచన అభిమానుల్లో కలవరం పుట్టిస్తుంది.
అసలైతే గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తనలాగ కాకుండా పవన్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండు చేస్తారు అని చెప్పారు. అయితే అన్న మాట జవదాటని పవన్ సినిమాలు తీస్తూనే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపాల గోపాల దర్శకులు డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఎన్నికలకు సిద్దం అవ్వాలనే ఆలోచనలో ఉన్న పవన్ అనుకోకుండా ఈ మధ్య అనంతపురం టూర్ లో బిజీ అయ్యారు. ఇదంతా చూస్తుంటే పవన్ సినిమాల కన్నా పాలిటిక్స్ కే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నాడు అని ఇట్టే తెలిసిపోతుంది. మరి ఈ క్రమంలో పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడేమొ అన్న భయంతో ఉన్నారు ఫ్యాన్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.