డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో నిన్నటి నుంచి రెండో షెడ్యూల్ మొదలయింది. 11 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరగనున్న ఈ షెడ్యూల్లో హీరో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్ , కీర్తి సురేష్ లతో పాటు సీనియర్ నటి కుష్బూ కూడా పాల్గొననున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పవన్ నటిస్తున్న ఈ మూవీకి “దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు మొదట్లో వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ‘పరదేశ ప్రయాణం’ అనే పేరు అనుకున్నట్లు తెలిసింది. అది కూడా కాదని ఈరోజు తెలిసింది. గోకుల కృష్ణుడు అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారు.
పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ లో గోకులంలో సీత సినిమాని చేశారు. అప్పుడు త్రివిక్రమ్ ఆ సినిమా రచయితల బృందంలో ఒకరిగా పనిచేశారు. అక్కడ నుంచే పవన్, త్రివిక్రమ్ మధ్య అనుబంధం మొదలయింది. ఇప్పుడు డైరక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ గోకుల కృష్ణుడు అనే టైటిల్ తో మరో సూపర్ హిట్ ఇవ్వనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీని దసరాకి రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.