పవన్ కళ్యాణ్ కి గతంతో పోల్చుకుంటే కొంచెం తీరిక దొరికింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్ కి విరామం ప్రకటించడంతో ఆయన కొంత ఉపశమనం పొందుతున్నారు. విషయంలోకి వెళితే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమల షూటింగ్స్ నిలిపివేయడం జరిగింది. దీనితో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రీకరణ నిలిచిపోయింది. హిందీ హిట్ మూవీ ‘పింక్’ కి తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో పవన్ లాయర్ రోల్ చేస్తున్నారు. వేసవి కానుకగా ఈ మూవీని మే లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ఐతే ఇంకా కొంత షూటింగ్ పార్ట్ మిగిలివుందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి వకీల్ సాబ్ మేలో విడుదలయ్యే సూచనలు లేవంటున్నారు.
దీనితో పాటు పవన్ దర్శకుడు పవన్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించాల్సిన ఈ మూవీ షూటింగ్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. టాలీవుడ్ టెక్నీషియన్స్ నిర్ణయం కారణంగా ఈ మూవీ చిత్రీకరణ కూడా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో బందిపోటు రోల్ చేస్తున్నారు. పింక్ అలాగే క్రిష్ మూవీ షూటింగ్ కి బ్రేక్ రావడంతో పవన్ పూర్తిగా రాజకీయాలపై ద్రుష్టి సారించారు. జనసేన ఆవిర్భావ దినం నాడు మన నుడి-మన నది కార్యక్రమం ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ప్రారంభించారు. అలాగే ఆయన రాజకీయ చర్చలలో భాగంగా ఢిల్లీ టూర్ వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా దొరికిన బ్రేక్ ని పవన్ ఇలా ఉపయోగిచుకుంటున్నాడు.