పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మామూలు మేటర్ కాదు.. ఇంకా వకీల్ సాబ్ సినిమా టీజర్ రాలేదు అప్పుడే ట్రెండింగ్ లో పెట్టేశారు. ఆశ్చర్యంగా ఉందా.. ఇప్పుడు యాష్ ట్యాగ్ తో వకీల్ సాబ్ టీజర్ ని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేసేశారు. ఇటీవల కాలంలో ఇలా యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేయడం అనేది చాలా ఫ్యాషన్ అయ్యిపోయింది. ప్రతి విషయానికి ఒక యాష్ ట్యాగ్ ని షేర్ చేస్తూ దాన్ని ట్రెండింగ్ లోకి వచ్చేలా చేసేస్తున్నారు ఫ్యాన్స్.
గతంలో ఇలాగే పవర్ స్టార్ బర్త్ డే ట్యాగ్ ని ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు వకీల్ సాబ్ టీజర్ ని రిలీజ్ కాకముందే చేసేస్తున్నారు. ఇక పవర్ స్టార్ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అజ్ఞాతవాసి 2018 జనవరిలో సంక్రాంతికి కానుకగా విడుదలైంది. ఓపెనింగ్స్ దుమ్మురేపినా కూడా సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చేసరికి కలక్షన్స్ భారీగా రాలేదు. ఇక పవన్ ని సిల్వర్ స్క్రీన్ పైన చూసి అభిమానులు చాలాకాలం అయ్యింది. ఈ కరోనా వైరస్ లేకపోతే మే నెలలోనే మనోడు థియేటర్స్ లో దుమ్మురేపేవాడు. కానీ, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు.
అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు. మరోవైపు వకీల్ సాబ్ సినిమా దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక టీజర్ కి సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.., ఈ సినిమాని అమెజాన్ వాళ్లు భారీ మొత్తానికి అడిగినా కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆఫర్ ని వదలుకున్నాడు. ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకే ప్లాన్ చేస్తున్నారు. అదీ మేటర్.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!