మూడు గంటల సినిమా.. వర్కవుట్ అవుతుందా..?

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ అనే పేరుతో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా రూపొందించారు. నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో లేని చాలా అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. విలన్లతో హీరోకి భారీ యాక్షన్ సీక్వెన్స్ యాడ్ చేశారు. అలానే హీరోయిన్ తో రొమాన్స్, పాటలు ఇలా కమర్షియల్ హంగులన్నీ జోడించారు.

పవన్ క్యారెక్టర్ కు ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలను చేర్చడం, పవన్ పాత్రను పెంచడంతో సినిమా నిడివి కూడా బాగా పెరిగినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘వకీల్ సాబ్’ దాదాపు మూడు గంటల సినిమా అని తెలుస్తోంది. ‘పింక్’ సినిమా రన్ టైం కేవలం 2 గంటల 16 నిముషాలు మాత్రమే. కేవలం ఒరిజినల్ కథను తీసుకొని సినిమా చేసి ఉంటే ‘వకీల్ సాబ్’ లెంగ్త్ కూడా అంతే ఉండేది. కానీ పవన్ పాత్రను పెంచడంతో సినిమా నిడివి 40 నిమిషాలు ఎక్కువైంది.

ఈ మధ్యకాలంలో మూడు గంటల సినిమా చూడాలంటే ప్రేక్షకులు విసిగిపోతున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ‘వకీల్ సాబ్’ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు. తమ కోసమే దర్శకుడు మాస్ సీన్స్ జోడించి సినిమాను తమకు నచ్చేట్లుగా తీర్చిదిద్దాడని అంటున్నారు. మూడు గంటల సినిమా అయినప్పటికీ.. కంటెంట్ ఉంటే వేరే రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus