Pawan Kalyan: ఓజీ షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టిన పవన్.. ఫోటో వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ఈయన సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓ జి సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈయన ఈ సినిమా షూటింగ్ కు జాయిన్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ హుడి ధరించి చాలా స్టైలిష్ లుక్ లో కనపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ కావడంతోనే నేటిజన్స్ (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ధరించిన ఈ హుడి కాస్ట్ ఎంత అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పవన్ ధరించిన ఈ డ్రెస్ కాస్ట్ తెలిసి కొనాలనుకున్నవారు పవన్ కళ్యాణ్ ధరించిన ఈ హుడి కొనేయొచ్చు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరోల ఫోటోలు బయట ఎక్కడ కనిపించినా వారు ధరిస్తున్న దుస్తులు,వాచీ పై అందరి దృష్టి పడుతుంది.

ఈ క్రమంలోని వాటి ధరల గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ ధరించిన ఈ హుడి మెన్స్ డన్ బ్రూక్ బ్లాక్ కమో న్యూ ఓర్లీన్స్ సెయింట్ లోగో రేంజర్ పుల్ ఓవర్ హుడీ పేరుతో సెయింట్స్ ప్రో షాప్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. వెబ్ సైట్ లో 60 డాలర్లకు అందుబాటులో ఉన్న ఈ హుడి మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే.. దాదాపు 5 వేలు.

షిప్పింగ్ కోసం మరో రూ.2,500 వేల ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా రూ.7,500 అవుతుందనమాట. ఇలా పవన్ కళ్యాణ్ ధరించిన ఈ హుడి కొనాలి అనుకుంటే అందరూ కాకపోయినా కొందరైనా ఈ హుడిని సొంతం చేసుకోవచ్చు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈయన ఓజీ సినిమాతో పాటు హర హర వీరమల్లు, సాయి ధరంతేజ్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా సుజిత్ సినిమాలో పాల్గొన్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus