పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నప్పటికీ.. అతను ఇండస్ట్రీకి రాకముందు డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు అని అతని చిన్నన్నయ్య నాగ బాబు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి సతీమణి సురేఖ.. పవన్ ను హీరోని చేయాలని పట్టుబట్టడంతో.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా నాగబాబు చేసాడు. హీరోగా మారినప్పటికీ పవన్ కళ్యాణ్ కు డైరెక్షన్ పై ఉన్న వ్యామోహం తగ్గలేదు. అందుకే ‘జాని’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ కు మొదటి డిజాస్టర్ ఇదే కావడం గమనార్హం. అటు తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు పవన్. అది కూడా డిజాస్టర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కు కథలు ఎంపిక చేసుకోవడంలో అలాగే.. అభిమానులను ఆకర్షించే అంశాలు ఉండేలా జాగ్రత్తపడడంలో మంచి పట్టు ఉంది. కానీ దర్శకత్వ బాధ్యతల్ని అతను హ్యాండిల్ చేయలేడు. అయినప్పటికీ ఇంకా దర్శకత్వం పై అతనికి మక్కువ ఎక్కువగానే ఉంది.
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. పవన్ కళ్యాణ్ ఓ స్టార్ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఆ దర్శకుడు మరెవరో కాదు దాసరి నారాయణ రావు గారు. ఆయన చిరంజీవితో తెరకెక్కించిన ‘లంకేశ్వరుడు’ చిత్రానికి పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!