‘వకీల్ సాబ్’ డబ్బింగ్ పూర్తి

దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘‘వకీల్ సాబ్’’. ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు-శిరీష్ నిర్మించగా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కంప్లీట్ చేశారు.దీంతో ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus