హిమజకు సర్ప్రైజ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది హిమజ. ఆ తరువాత ‘శివమ్’ ‘శతమానం భవతి’ ‘ధృవ’ ‘జనతా గ్యారేజ్’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘చిత్రలహరి’ ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాల్లో నటించింది. ‘బిగ్ బాస్ సీజన్3’ లో ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం.. మెగా స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ అలాగే పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ అవకాశాలు దక్కించుకుంది హిమజ.

ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ సెల్ఫీ తీసుకుని దానిని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది హిమజ. దానికే ఆమె తబ్బుబ్బిలైపోతుంటే.. తాజాగా ఆమెకు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. వివరాల్లోకి వెళితే.. హిమజకు పవన్ ఓ లేఖ రాసాడు. దీనిని తన ఇన్స్టాలో తన అభిమానులతో షేర్ చేసుకుంది హిమజ. ఇక ఆ లేఖలో పవన్ కళ్యాణ్.. ‘‘హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అంటూ పేర్కొన్నాడు.

దీనికి హిమజ ‘నా ఆనందాన్ని మాటల్లోనూ,ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నాను’ అంటూ హిమజ గాల్లో తేలిపోతుంది. ఇక పవన్ కళ్యాణ్- క్రిష్ ల చిత్రం టైటిల్ ను ఇంకా అనౌన్స్ చెయ్యలేదు కానీ. 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. పవన్ తో ‘ఖుషి’ ‘బంగారం’ వంటి చిత్రాలను నిర్మించిన ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం.


Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus