Aadhya: టీవీ షోలో మెగాప్రిన్సెస్.. ప్రోమో వైరల్!

పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణుదేశాయ్ తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని పూణేకి వెళ్లిపోయింది. అక్కడే సెటిల్ అయిపోయింది. ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి కూడా రెడీ అయింది. నిశ్చితార్ధం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లితో ఈ జంట ఒక్కటి కాబోతుంది. ఇదిలా ఉండగా.. రేణుదేశాయ్, పవన్ ల సంతానం అకీరా, ఆద్యలు చాలా రేర్ గా కనిపిస్తుంటారు. కనీసం అకీరా అయినా.. మెగాఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్ లో కనిపిస్తుంటాడు కానీ ఆద్య పెద్దగా కనిపించదు. వీలైనంతగా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంటారు.

అయితే ఫైనల్ గా మన లిటిల్ మెగా ప్రిన్సెస్ మొదటిసారి పబ్లిక్ గా ఓ షోలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రేణుదేశాయ్ ఈ మధ్యకాలంలో కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. జీతెలుగులో ప్రసారమవుతోన్న ‘డ్రామా జూనియర్స్’ షోకి కూడా రేణు జడ్జిగా వ్యవహరిస్తోంది. మదర్స్ డే సందర్భంగా ఈ షోని స్పెషల్ గా డిజైన్ చేశారు. ఈ క్రమంలో ఈ షోకి ఆద్యను గెస్ట్ గా తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఆద్య స్టేజ్ పైకి రాగానే.. రేణుదేశాయ్ వెళ్లి హత్తుకుంది. తనకు దేవుడిచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఆద్య అని చెప్పగా.. ”మమ్మీ ఈజ్ ది బెస్ట్ మామ్ ఎవర్” అంటూ ఆద్య తన తల్లిపై ప్రేమను కురిపించింది. ఈ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షో కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న మదర్స్ డే సందర్భంగా రాత్రి 8 గంటలకు ఈ షోను ప్రసారం చేయనున్నారు!


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus