మరోసారి సహనం కోల్పోయిన పవన్ మాజీ భార్య..!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరో సారి సహనం కోల్పోయింది. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని చాలా కాలమే గడిచినా.. ఆమె రెండో పెళ్ళికి కూడా రెడీ అవుతున్నా.. కొందరు అభిమానులు మాత్రం ఆమెను విసిగిస్తూనే ఉన్నారు. దీంతో చాలా కాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే చాలా కాలమైంది కదా ఇక ఎవరూ విసిగించారనుకుందేమో.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చింది రేణూ దేశాయ్. అయితే ఈసారి కూడా ఆమెకు చేదు అనుభవమే ఎదురయ్యింది.

రేణూ పెళ్లిచేసుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరంటూ పదే.. పదే తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన ప్రశ్నలే ఎక్కువ అడుగుతూ ఆమెను విసిగించారు. చాలా సేపు సహనంగా ఉంటూ ఆ విషయాన్నీ డైవర్ట్ చేయడానికి ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో సహనం కోల్పోయిన రేణూ దేశాయ్.. “సెలెబ్రిటీలు కూడా మనుషులే … వారికీ విడిగా జీవితం ఉంటుంది, అది గుర్తించండి కొంచెం..! ఇలా అసంబద్దమైన ఇష్టం లేని ప్రశ్నలతో అదేపనిగా విసిగించడంలో ఆంతర్యం ఏమిటి. లైవ్ లోకి వస్తే చాలు.. ఎప్పుడూ ఇదే గోల?” అంటూ క్లాస్ పీకింది రేణూ. సోషల్ మీడియా అనేది ఓపెన్ ప్లేట్ ఫామ్.. ఇక్కడ అనేక కామెంట్స్ రావడం ఖాయం, అందులోనూ సెలెబ్రిటీలు వస్తే.. వారి వ్యక్తిగత జీవితానికి సంబందించిన అనేక ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.. వాటన్నిటికీ సిద్దపడే చాలా మంది లైవ్ లోకి వస్తారు. ఇది రేణూ దేశాయ్ కి తెలియంది కాదు. నెటిజెన్ల పై మండి పడితే ఉపయోగం ఏముంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చే అభిమానులు చాలా మంది ఉంటారు.. అందులో డౌట్ లేదు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమే కానీ అన్నిటికి సిద్దపడే.. రేణూ లైవ్ లోకి వస్తే బెటర్ అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus