OG Glimpse: లుక్స్ తోనే అంచనాలు పెంచేసిన పవన్ కళ్యాణ్.. పవన్ నట విశ్వరూపమంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ ద్వారా ఈ సినిమాపై అంచనాలను పెంచగా 100 సెకన్ల నిడివితో విడుదలైన ఈ గ్లింప్స్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. గ్లింప్స్ లో పవన్ కు ఇచ్చిన ఎలివేషన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. లుక్స్ తోనే పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను ఫిదా చేశారు. “పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా..

అది మట్టి చెట్లతో పాటు ఊరినే ఊడ్చేసింది కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది” అంటూ పవన్ కు ఎలివేషన్ ఇస్తూ బ్యాగ్రౌండ్ లో వచ్చిన వాయిస్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ యాక్షన్ షాట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. థమన్ బీజీఎం అదుర్స్ అనేలా ఉంది. పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు.

పవన్ అభిమానులకు విందుభోజనంలా (OG) ఈ గ్లింప్స్ ఉంది. గ్లింప్స్ లోని కొన్ని షాట్స్ వింటేజ్ పవన్ కళ్యాణ్ కు గుర్తు చేస్తున్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటిస్తుండగా గ్లింప్స్ లో ఆమెకు ఏ మాత్రం ప్రాధాన్యత దక్కలేదు. గ్లింప్స్ చివర్లో పవన్ తన మేనరిజమ్స్ తో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

నిమిషాల్లోనే ఈ గ్లింప్స్ కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇది గ్లింప్స్ కాదు గూస్ బంప్స్ అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మరిన్ని విజయాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus