OG Movie: స్క్రిప్ట్ లో మార్పులు.. నిర్మాత దానయ్య పై భారం పడనుందా?

పవన్ కళ్యాణ్ రెట్టింపు ఉత్సాహంతో ‘ఓజీ’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఆల్రెడీ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ రెండో షెడ్యూల్‌ను కూడా మొదలుపెట్టేశాడు. పూణే సమీపంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.పవన్ కళ్యాణ్ అలాగే హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. మహాబలేశ్వర్ లోని అందమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. బృందా కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది.

ఇది గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం. అయితే మొదట ఈ చిత్రంలో పాటలు, హీరోయిన్ ట్రాక్ ఉండదు అని టీం చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని.. హీరోయిన్ ట్రాక్ ను అలాగే పాటలు ఉండేలా స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. అందువల్ల సినిమా బడ్జెట్ కూడా 20 శాతం పెరుగుతుందట. అయినా నిర్మాత డివివి దానయ్య హ్యాపీగానే ఉన్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆయన 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారట.

అలాంటిది పాటలు, హీరోయిన్ ట్రాక్ లేకుండా సినిమా చేయడం ఏంటి.. అనే ఆలోచన ఆయనకు కూడా ఉందట. అందుకే బడ్జెట్ పెరిగినా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని దానయ్య చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ‘ఓజి’ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని ఏక కాలంలో విడుదల చేసేలా ప్లే చేస్తున్నాడు దర్శకుడు సుజీత్.

అతని దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ చిత్రం హిందీలో సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ‘ఓజి’ (OG Movie) ని కూడా హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus