Vinodhaya Sitham: ‘వినోదయ సీతమ్’ రీమేక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్

సినిమాలతోనే కాకుండా రాజకీయపరమైన వార్తలతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు పవన్ కళ్యాణ్. అతని ‘జనసేన’ ని బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్.. మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు.ఈ మధ్యనే హరీష్ శంకర్, సుజీత్ ల సినిమాలు పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు.హరీష్ శంకర్ తో చేయబోయే సినిమా ‘తేరి’ రీమేక్ అని తెలుస్తుంది. ఇక సుజీత్ దర్శకత్వంలో చేయబోయేది ‘ఓజి’ అనే గ్యాంగ్ స్టర్ డ్రామా కావడం విశేషం.

నిజానికి దీనికంటే ముందే పవన్ కళ్యాణ్ తమిళ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ రీమేక్ లో నటిస్తానని మాటిచ్చారు. కానీ ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏ వార్త రాకపోవడంతో అది ఆగిపోయిందని అంతా అనుకుంటున్నారు. సముద్ర ఖని ఆ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఆ ప్రాజెక్టుని స్టార్ట్ చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని తెలుస్తుంది. ఫిబ్రవరి 14న ఆ మూవీని కూడా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నాడు. అతనికి జోడీగా కేతిక శర్మ లేదా సంయుక్త మీనన్ లు నటించబోతున్నారు అని వినికిడి. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఈ ఒరిజినల్ తో పోలిస్తే చాలా మార్పులు చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ 18 రోజుల కాల్ షీట్లు ఇవ్వబోతున్నట్లు ఇన్సైడ్ టాక్.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus