Peddha Kapu: కొత్త కుర్రాడికి ఇంత బడ్జెట్ పెట్టారా..!

ఫ్యామిలీ చిత్రాలు, మంచి చిత్రాలు తెరకెక్కిస్తాడు అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి మంచి పేరు ఉంది. అతని ట్రాన్స్ఫర్మేషన్ ను మనం ‘నారప్ప’ సినిమాలో చూశాం. నిజంగా శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమా తీశాడు అంటే నమ్మడం కష్టమే. కానీ అది తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ కి రీమేక్. చాలా వరకు ఒరిజినల్ నే కాపీ పేస్ట్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. అలాగే అది థియేటర్లలో రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సినిమా కూడా కాదు.

అయితే ఆ సినిమా వల్ల (Peddha Kapu) ‘పెదకాపు 1 ‘ అనే బిగ్ బడ్జెట్ మూవీ తెరకెక్కించే ఛాన్స్ మాత్రం శ్రీకాంత్ అడ్డాలకి దక్కింది. కొత్త కుర్రాడు విరాట్ కర్ణ హీరోగా నటించిన మూవీ ఇది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన ‘ద్వారకా క్రియేషన్స్‌’ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. హీరో కూడా ఇతనికి బావమరిది. అందుకేనేమో ఈ సినిమాకి బడ్జెట్ విషయంలో అతను రాజీ పడలేదు.

అందుకే ఈ చిత్రానికి ఏకంగా రూ.48 కోట్ల బడ్జెట్ పెట్టాడు అని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం. అయితే థియేట్రికల్ బిజినెస్ ఆ రేంజ్లో జరిగిందా? డిజిటల్ ఇంతకు అమ్మారు? అంటే మాత్రం.. సమాధానం ఇంకా వినిపించడం లేదు. ఏది ఏమైనా కొత్త హీరోకి ఇంత బడ్జెట్ పెట్టడానికి ఏ నిర్మాత సాహసించడు. తన బావమరిది కాబట్టి మిర్యాల రవీందర్ రెడ్డి పెట్టడానికి ముందుకొచ్చాడు అనుకోవచ్చు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus