రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా ఇప్పటివరకూ వచ్చిన ప్రచారంతో మాస్ సినిమాగా హైలెట్ అయింది. బుచ్చి బాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఓ భారీ సామాజిక నేపథ్యం ఉన్న మాస్ డ్రామా అన్న మాట వినిపిస్తోంది. అయితే తాజాగా లీకైన సమాచారం ప్రకారం, ఇందులో మాస్ యాంగిల్‌తో పాటు ఎమోషనల్ లేయర్స్ కూడా దాగున్నాయి. తొలిషాట్ నుంచే చరణ్ కొత్త లుక్‌తో ఫుల్ యాటిట్యూడ్ చూపించినా, స్క్రిప్ట్‌లో ముఖ్యంగా బలంగా ఉన్నది క్యారెక్టర్స్ మధ్య నడిచే భావోద్వేగాలు అన్నది యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట.
ప్రత్యేకంగా చరణ్ – శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ కానున్నాయని సమాచారం. వీటి ద్వారా కథలో డెఫ్త్ పెరుగుతుంది అని టాక్. దర్శకుడిగా బుచ్చి బాబు తొలి సినిమా ‘ఉప్పెన’లోనే (Uppena) ఎమోషనల్ హైప్స్ క్రియేట్ చేసిన తీరు తెలిసిందే. అదే స్ఫూర్తితో ఈ సినిమాలో కూడా బలమైన సెంటిమెంట్ బేస్‌తో కథను మలచాడట. పెద్ది అనే టైటిల్ వెనక ఉన్న భావాన్ని కూడా సినిమా సాగే కొద్దీ ఆడియెన్స్ అర్థం చేసుకుంటారట.
టైటిల్ ఎమోషన్‌కి మాస్‌కు మధ్య ఉన్న లింక్ ని బలంగా చూపించబోతున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుండగా, ఏ.ఆర్. రెహమాన్ (A.R.Rahman) సంగీతం సినిమాకి మరో లెవెల్ హై తీసుకెళ్తుందని నమ్మకం. చరణ్ ఒక ఆట కూలీ పాత్రలో కనిపించబోతుండగా, సామాజికంగా శక్తివంతమైన కథ ఇది. ఫస్ట్ షాట్ విడుదల తర్వాత పెరిగిన హైప్‌తో మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ రెండు వర్గాలకూ సినిమాను చేరువ చేసేలా స్క్రిప్ట్ ప్లాన్ చేశారు.
2026 మార్చిలో సినిమా థియేటర్లలోకి రానుండగా, ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ మరొకసారి పాన్ ఇండియా రేంజ్‌ను దాటి, భావోద్వేగాలతో కూడిన మాస్ బ్లాక్‌బస్టర్ అందించనున్నాడు. మాస్ మాత్రమే కాదు, హార్ట్ టచ్ ఉండే కథతో పబ్లిక్‌లో మెరుపులు మెరిపించనున్నాడు.