శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా గౌరీ రోనంకి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ మూవీ ‘పెళ్ళిసందD’ . స్టార్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ సినిమా 2021 అక్టోబర్ 15న రిలీజ్ అయ్యింది. ఎం.ఎం.కీరవాణి సంగీతంలో రూపొందిన ఈ సినిమా పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
అలాగే శ్రీలీల లుక్స్ కూడా యూత్ ని అమితంగా ఆకట్టుకున్నాయి. వాటికి తోడు శ్రీకాంత్ ‘పెళ్ళిసందడి’ క్రేజ్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి హెల్ప్ అయ్యింది.అందువల్ల సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ‘పెళ్ళిసందD’ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
ఈ సందర్భంగా ఒకసారి ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.08 cr |
సీడెడ్ | 1.55 cr |
ఉత్తరాంధ్ర | 1.06 cr |
ఈస్ట్ | 0.53 cr |
వెస్ట్ | 0.40 cr |
గుంటూరు | 0.64 cr |
కృష్ణా | 0.45 cr |
నెల్లూరు | 0.35 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 7.06 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా +ఓవర్సీస్ | 0.60 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 7.66 కోట్లు (షేర్) |
‘పెళ్ళిసందD’ చిత్రం రూ.5.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.7.66 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. మొత్తంగా బయ్యర్లకు రూ.2.46 కోట్ల లాభాలు అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.