‘పెళ్ళిసందD’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎందులో..?

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పెళ్ళిసందD’. దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్లాప్ టాకే వచ్చింది కానీ మంచి వసూళ్ళను రాబట్టి కమర్షియల్ హిట్ గా నిలిచింది.అందుకు సంగీత దర్శకుడు కీరవాణి అందించిన పాటలు హీరోయిన్ శ్రీలీల గ్లామర్ బాగా తోడైనట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం థియేట్రికల్ రన్ క్లైమాక్స్ కి రావడం

పైగా అక్కడ హిట్ గా నిలవడంతో ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం…‘పెళ్ళిసందD’ చిత్రం నవంబర్ 19న లేదా నవంబర్ 26 నుండీ డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. సో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూడొచ్చన్న మాట. ఇదిలా ఉండగా.. నిజానికైతే ‘పెళ్ళిసందD’ చిత్రాన్ని మొదట నేరుగా ఓటిటిలో విడుదల చేయాలి అనుకున్నారు.

ఈ చిత్రానికి ‘ఆహా’ ఓటిటి వారు రూ.4.5 కోట్ల డిజిటల్ ఆఫర్ ఇచ్చారు. కానీ మేకర్స్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ కు మక్కువ చూపారు. దాదాపు అదే రేటుకి వారు థియేట్రికల్ రిలీజ్ చేయగా.. మొదటి వారమే పెట్టిన మొత్తం రాబట్టి లాభాలను అందించింది ఈ చిత్రం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus