Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 19, 2020 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మహానటి మూవీ తరువాత హీరోయిన్ కీర్తి సురేష్ కి ఓ కొత్త ఇమేజ్ వచ్చి చేరింది. ఆ సినిమాతో మంచి నటిగా పేరుతెచ్చుకున్న ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు.. దర్శకుల బెస్ట్ ఛాయిస్ గా మారారు. ఇక మహానటి సినిమా తరువాత ఆమె చేసిన మొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్. లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నేరుగా ఓ టి టి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని నేడు విడుదల చేయడం జరిగింది. పెంగ్విన్ అనే ఓ అరుదైన పక్షి పేరును టైటిల్ గా ఎంచుకొని ఆసక్తిరేపగా టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి ఇన్ని అంచలనాల మధ్య విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ పెంగ్విన్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

కథ: గర్భవతి అయిన రిథమ్(కీర్తి సురేష్) ఆరేళ్ళ క్రితం తప్పిపోయిన తన కొడుకు అజయ్(మాస్టర్ అద్వైత్) గురించి ఆలోచిస్తూ నిరాశ, నిస్పృహలతో జీవితం గడుపుతూ ఉంటుంది. అజయ్ కిడ్నాప్ చేయబడ్డాడు..అతన్ని చార్లీ చాప్లిన్ ముసుగులో ఉన్న ఓ క్రిమినల్ ఎత్తుకు పోయాడు..అతడు తిరిగిరాడు అని అక్కడి వారు చెవుతూ ఉంటాడు. ఐతే కొడుకుపై మమకారం కలిగిన రిథమ్ అజయ్ కోసం వెతుకులాట ఆపదు. చివరికి ఆమె అజయ్ విషయంలో ఓ కీలక సమాచారం తెలుసుకుంటుంది. అసలు ఈ ముసుగు వ్యక్తి ఎవరు? అతను అజయ్ ని ఎందుకు కిడ్నాప్ చేశారు? మరి రిథమ్ ఆ క్రిమినల్ పై పోరాడి తన కుమారుడిని వెనక్కు తెచ్చుకుందా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే పెంగ్విన్..

నటీనటులు తీరు: దర్శకుడు ఈ మూవీ కథ కథనాల కంటే కూడా కేవలం కీర్తి సురేష్ ని దృష్టిలో పెట్టుకొని మూవీ తీశారా అని ప్రతి ప్రేక్షకుడికి అనిపించకమానదు. సినిమా చూస్తున్నంత సేపు మనకు కీర్తి సురేష్ ఆమె పాత్ర మాత్రమే తెరపై కనిపిస్తుంది. కొడుకు కోసం ఆవేదనా.. ఎలాగైనా అతన్ని కనిపెట్టాలనే ఆరాటం..తన కొడుక్కి ఏమైయ్యిందో అనే భయం వంటి అనేక భావాలు కీర్తి సురేష్ చక్కగా పలికించారు. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన పాయింట్ కీర్తి సురేష్ నటన మాత్రమే. మహానటి తరువాత అంత వెయిట్ ఉన్న పాత్ర దక్కించుకున్న కీర్తి ఆ పాత్రకు వందశాతం న్యాయం చేసింది. తను ఓ అధ్బుత పరఫార్మర్ అని ఆమె నిరూపించుకుంది.

ఇక ఈ మూవీలో రఘు పాత్ర చేసిన లింగా నటన ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్ తరువాత ఈ సినిమలో ప్రాధాన్యం ఉన్న పాత్ర లింగాదే. చైల్డ్ ఆర్టిస్ట్ అద్వైత్ పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉండగా తన పరిధిమేర మెప్పించాడు. ఈ సినిమాలో భావన అనే ఓ కీలక రోల్ చేసిన నిత్యా కిరుబు పాత్రకు.. కీర్తి సురేష్ పాత్రకు పోటీగా మలచగల ఆస్కారం ఉంది. ఐతే దర్శకుడు కీర్తి మినహా ఏ ఒక్క పాత్రను డీప్ గా నేరేట్ చేయలేదు.

సాంకేతికవర్గం పనితీరు: సాంకేతిక వర్గంలో ముందుగా చెప్పుకోవాల్సినది సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ గురించి. సగటు క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఆయన బీజీఎమ్ సాగింది. సస్పెన్సు అండ్ ఎమోషనల్ సన్నివేశాలకు బీజీఎమ్ మంచి ఫీల్ చేకూర్చి తెరపై పండడంలో ఉపయోగపడింది. కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటింగ్ సైతం మెచ్చుకోదగ్గ సాంకేతిక అంశమే. నిర్మాణ విలువలు మెప్పించాయి.

ఇక దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ ని రొటీన్ కి భిన్నంగా కొంచెం కొత్తగా చెప్పాలని ట్రై చేశారు. ఐతే ఆయన ముఖ్యమైన కథా, కథనాల కంటే కీర్తి సురేష్ పాత్రపైనే పూర్తి ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు పెంగ్విన్ ద్వారా మంచి అనుభూతి పంచలేకపోయాడు. స్పష్టత లేకుండా సాగే స్క్రీన్ ప్లే సగటు ప్రేక్షకుడిని కన్ఫ్యూషన్ లోకి నెట్టింది. కీర్తి సురేష్ పాత్రను తీర్చిదిద్దిన తీరు,చివరి వరకు కొనసాగించిన సస్పెన్స్ లాంటి అంశాలకు ఆయనకు మార్కులు పడతాయి.

విశ్లేషణ: ఎమోషన్స్ మరియు క్రైమ్ కలగలిపి ఓ సరికొత్త సస్పెన్సు థ్రిల్లర్ తెరకెక్కించాలని దర్శకుడు ప్రయత్నం పూర్తి స్థాయిలో సఫలం కాలేదు అని చెప్పాలి. ఐతే మొదటి 40నిముషాలు సినిమాకు మంచి ఆరంభం లభించినా, దానిని చివరి వరకు తీసుకెళ్లలేకపోయాడు. పట్టులేని స్క్రీన్ ప్లే ప్రేక్షకుడికి ఆ థ్రిల్ కలిగించలేకపోయింది. కేవలం కీర్తి సురేష్ కోసమే సినిమా అన్నట్లు సాగే కథనంలో… అనేక పాత్రలకు కనీస ప్రాధాన్యత కూడా ఉండదు. కనిపించని కొడుకు కోసం తల్లిపడే ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు.. ఐతే ఆ తాలూకు ఎమోషనల్ టచ్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు.

ఐతే అసలు ఈ కిడ్నాపర్ ఎవరు, అసలు ఎందుకు అతను పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాడన్న ఉత్కంఠ మాత్రం చివరివరకు సాగుతుంది. చాలా పాత్రపై అనుమానం కలిగేలా ఆయన ఉత్కంఠ రేపారు. కానీ ఆ ముసుకు వెనకున్న క్రిమినల్ ఎవరనే విషయం నిరుస్తాహపరచడంతో క్లైమాక్స్ తేలిపోయింది. అప్పటి వరకు విలన్ గురించి ఎన్నో ఊహించుకున్న ప్రేక్షకులకు ఇంతేనా.. అన్న భావన కలుగుతుంది. కాగా కీర్తి సురేష్ అద్భుత నటన, అక్కడక్కడా మెప్పించే అంశాలు, సినిమాకు మంచి ఫీల్ యాడ్ చేసిన బీజీఎమ్ ప్రేక్షకుడికి ఉపశమనం కలిగించే అంశాలు. లాక్ డౌన్ సమయంలో కొత్త సినిమాల కోసం తపిస్తున్న సినీప్రేమికులు ఓ సారి పెంగ్విన్ ని చూడడంలో తప్పేమి లేదు. ఐతే భారీ అంచనాలతో టీవీ ముందు కూర్చుంటే నిరాశపడే అవకాశం ఉంది.

రేటింగ్: 2.5/5

Click Here To Read English Review

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eashvar Karthic
  • #Karthik Subbaraj
  • #keerthy suresh
  • #Penguin Movie
  • #Penguin Movie Review

Also Read

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

16 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

20 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

22 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

1 day ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

16 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

19 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

20 hours ago
Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

21 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version