‘పెంగ్విన్’ టీజ‌ర్ రివ్యూ!

ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటిసారి… సమంత అక్కినేని, తాప్సీ పన్ను, త్రిష మరియు మంజు వారియర్‌ వంటి నలుగురు సౌత్ స్టార్ హీరోయిన్లు కలిసి.. మరో స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రం టీజర్ ను తాజాగా విడుదల చేశారు. డైరెక్ట్ ఆన్లైన్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 19న ఈ చిత్రం నేరుగా విడుదల కాబోతుంది.

ఇక విడుదలైన టీజర్ విషయానికి వస్తే.. ఇది ఓ సైకలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ‘ఈ సృష్టిలో ప్రతీ ఒక్క వ్యక్తి కథ వెనుక తల్లి ఉంటుంది. ఎందుకంటే తల్లితోనే మన జీవితం మొదలవుతుంది’ అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం కథ ఉంటుందని తెలుస్తుంది. ఓ తల్లి తన పిల్లలను కాపాడుకోవడానికి చేసే శారీరక, భావోద్వేగ ప్రయాణమే ఈ ‘పెంగ్విన్’ అని తెలుస్తుంది.

కార్తీక్ సుబ్బరాజ్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ మరియు ప్యాషన్ స్టూడియోస్ ప్రొడక్షన్ కలిసి నిర్మించిన ఈ చిత్రం పోస్టర్ ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకుని సినిమా పై క్రేజ్ ఏర్పడేలా చేసింది.ఇప్పుడు టీజర్ ఆ అంచనాలను డబుల్ చేసిందనే చెప్పాలి. తన పిల్లల కోసం ఆరాటపడే ఓ తల్లిగా కీర్తి సురేష్ కనిపిస్తుంది. టీజర్ అయితే కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంది. తెలుగు, తమిళంతో పాటుగా మళయాళంలో కూడా ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ ను జూన్ 11న విడుదల చెయ్యనున్నారు.


మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus