ఈ రోజుల్లో సినిమా సక్సెస్ కావడమంటే బాక్సాఫీస్ దుమ్ముదులపడం కాదు. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చేరువ కావడం, సగటు ప్రేక్షకుడి మనసు దోచుకోవడం. పెద్ద సినిమాల్లోనే కాదు చిన్న సినిమాల్లోనూ అటువంటి సత్తా ఉందని ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. తాజాగా అదే బాటలో ప్రేక్షకులను పలకరించేందుకు రంగంలోకి దిగుతోంది ‘ఏవమ్ జగత్’ మూవీ. ప్రేరణాత్మకమైన వైవిద్యభరితమైన కథను రూపొందిన డైరెక్టర్ దినేష్ నర్రా.. ఈ సినిమాకు ప్రేక్షకులకు చేరువ చేయడంలోనూ వినూత్న ఆలోచన చేశారు. కేవలం ఒకే ఒక్క రూపాయితో సినిమా చూసే ఛాన్స్ కల్పిస్తున్నారు.
ఓ విలేజ్ కుర్రాడి ఆశ, ఆశయాలను ప్రధాన భూమికగా తీసుకొని అన్ని వర్గాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ ప్రేరణ పొందేలా రైతు నేపథ్యంలో ‘ఏవమ్ జగత్’ సినిమా రూపొందించారు దినేష్ నర్రా. కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాను మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. పూర్తి పల్లెటూరు వాతావరణంలో అందమైన పల్లెటూరు అందాల్లో చిత్రీకరించిన ఈ సినిమాకు ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సేంద్రీయ వ్యవసాయం, పల్లె వాతావరణం విస్మరించి కృతిమ వ్యవసాయం చేస్తే భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. కంటెంట్ ఉన్న సినిమా ఇదని, ఇలాంటి సినిమా కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నామని ఎంతోమంది నెటిజన్స్ కామెంట్లు పెట్టారు.
ఈ నేపథ్యంలో ‘ఏవమ్ జగత్’ చిత్రాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే సదుద్దేశంతో కేవలం ఒక రూపాయితో సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నారు. జనవరి 16 నుంచి ఆన్ లైన్ వేదికపై ఈ మూవీ ప్రసారం కానుంది. ఒక్క రూపాయితో ఇంటిల్లిపాది తిలకించి సినిమాను ఎంజాయ్ చేయండని ఈ సందర్భంగా డైరెక్టర్ దినేష్ నర్రా తెలిపారు. పల్లెటూరి రైతాంగం ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. పల్లెకు, పట్నానికి, యువత టాలెంట్‌కి లింక్ చేస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!