Prabhas: పీపుల్ మీడియా భవిష్యత్తు ప్రభాస్ చేతుల్లోనే..!

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై మొదటి నుండి జనాల్లో ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) , వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) .. వంద సినిమాలు నిర్మించాలనే బలమైన సంకల్పంతో పనిచేస్తున్నారు. వారు చెప్పినట్టు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. కానీ ఏదీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడట్లేదు. మొదట్లో వేరే బ్యానర్లతో కలిసి సినిమాలు నిర్మిస్తూ వచ్చింది ‘పీపుల్ మీడియా’ సంస్థ. సురేష్ బాబుతో కలిసి కొన్నాళ్ళు, అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) తో కలిసి కొన్నాళ్ళు..

Prabhas

విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల..లు కలిసి సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. కానీ ‘రామబాణం’ నుండి సోలోగా నిర్మించడం మొదలుపెట్టారు. అక్కడి నుండి వీళ్ళని ప్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి. ‘రామబాణం’ (Ramabanam) ‘బ్రో’ (BRO) ‘ఈగల్’ (Eagle) ‘మనమే’ (Manamey) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) .. ఇలా వీళ్ళు సోలోగా నిర్మించిన సినిమాలు అన్నీ నష్టాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ సంస్థలో ఓ మంచి హిట్టు పడాలి. ప్రస్తుతం శ్రీవిష్ణుతో (Sree Vishnu) ‘స్వాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు.

ఇది హిట్టయినా గట్టిగా రూ.10 కోట్లు షేర్ రేంజ్ సినిమానే ఇది. మరోపక్క గోపీచంద్ (Gopichand) తో ‘విశ్వం’ (Viswam) అనే సినిమా చేస్తున్నారు. శ్రీనువైట్ల (Srinu Vaitla) డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాపై జనాలకి నమ్మకం లేదు. హిట్ అయినా ముందు సినిమాలు మిగిల్చిన నష్టాలు తీర్చే సినిమా కాదు అది. సో పీపుల్ మీడియాని కాపాడే స్టామినా ఒక్క ‘రాజా సాబ్’ (The Rajasaab) కే ఉంది.

అవును ప్రభాస్ (Prabhas) – మారుతి (Maruthi Dasari) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పీపుల్ మీడియా సంస్థ చాలా హోప్స్ పెట్టుకుంది. ఓ మాదిరి టాక్ వచ్చినా ఈ సినిమాకి రూ.300 కోట్లు వసూళ్లు వస్తాయి. 2025 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10 న ‘రాజాసాబ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఈ సినిమా సక్సెస్ ‘పీపుల్ మీడియా’ కి చాలా కీలకం.

 ‘గూఢచారి 2’ : రూ.55 కోట్లు అనుకుంటే.. అంత పెరిగిందా.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus