గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వం’ (Viswam) సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలైంది. సినిమాకి తొలి రోజు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసింది. వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని తన ‘చిత్రాలయం స్టూడియోస్’ బ్యానర్ పై నిర్మించడానికి ముందుకు వచ్చారు. ‘షైన్ స్క్రీన్స్’ అధినేత హరీష్ పెద్ది కూడా ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామిగా చేరారు. కానీ తర్వాత ఆయన తప్పుకున్నారు.
దీంతో ‘విశ్వం’ మూవీ ఫైనాన్సియల్ గా ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ ప్రాజెక్టుని టేకోవర్ చేశారు. ఆ టైంలో వేణు దోనెపూడి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని సెటిల్ చేస్తాను అని అగ్రిమెంట్ పై కూడా విశ్వ ప్రసాద్ సంతకం పెట్టారట. కానీ సినిమా రిలీజ్ అయ్యింది. దానికి ముందే బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. కానీ వేణు దోనెపూడి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని.. టి.జి.విశ్వప్రసాద్ చెల్లించలేదట.
వేణు దోనెపూడి కాల్స్ కి కూడా విశ్వప్రసాద్ రెస్పాండ్ అవ్వట్లేదని ఛాంబర్ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. ‘పీపుల్ మీడియా..’ కి చెందిన మిగతా టీం కూడా వేణుని పట్టించుకోక పోవడం వల్ల.. ఆయన తెలుగు ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించినట్లు సమాచారం. ‘విశ్వం’ కి పనిచేసిన టెక్నిషియన్స్ చాలా మందికి చెల్లించాల్సిన డబ్బులు కూడా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారు చెల్లించలేదని సమాచారం. మరి ఛాంబర్ పెద్దలు ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.