Sreeleela: సమంత వల్ల జరిగిన ట్రోలింగే శ్రీలీలకి ప్లస్ అయ్యిందా?

శ్రీలీల (Sreeleela)  అభిమానులకి ఒక గుడ్ న్యూస్. కొంత గ్యాప్ తర్వాత ఆమె ఖాతాలో ఓ ఆల్ టైం రికార్డు చేరింది. విషయంలోకి వెళితే.. ‘కిస్సిక్’ పాట 2 రోజుల క్రితం యూట్యూబ్లో రిలీజ్ అయ్యింది. ఇలా యూట్యూబ్లోకి వచ్చిందో లేదో.. కాసేపటికే ఈ పాటపై ట్రోలింగ్ మొదలైంది. ఈ పాట సమంత ‘ఊ అంటావా మామ ఉఊ అంటావా’ పాట రేంజ్లో లేదు అంటూ అంతా పెదవి విరిచారు. పైగా తెలుగు సింగర్ తో పాడించకపోవడం ఒక మైనస్ అని అంతా అన్నారు.

Sreeleela

మరోపక్క సమంత (Samantha)  ఫ్యాన్స్ కూడా శ్రీలీలపై ట్రోలింగ్ కి దిగారు. ‘సమంతని శ్రీలీల మ్యాచ్ చేయలేకపోయింది’ అంటూ వారి కడుపు మంటను బయటపెట్టారు. దీంతో ‘కిస్సిక్’ పాట వర్కౌట్ కాలేదేమో.. అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ‘కిస్సిక్’ పాట యూట్యూబ్లో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. అవును సమంత ‘ఊ అంటావా మామ ఉఊ అంటావా’ పాట యూట్యూబ్లో విడుదలైన 24 గంటల్లో 12.39 మిలియన్ వ్యూస్ ను రిజిస్టర్ చేసింది.

కానీ శ్రీలీల ‘కిస్సిక్’ పాట విడుదలైన 24 గంటల్లో ఏకంగా 27.19 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి.. నెంబర్ వన్ ప్లేస్లో నిలిచింది. సమంత సాంగ్ ని శ్రీలీల సాంగ్ డబుల్ మార్జిన్ తో కొట్టింది అని చెప్పాలి. ఇక ఈ పాటలో శ్రీలీల డాన్సులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని.. ఏకంగా అల్లు అర్జునే  (Allu Arjun) ఆమెతో కలిసి డాన్స్ చేయడానికి జడిసి పోయినట్టు తెలిపిన సంగతి తెలిసిందే.

‘పుష్ప 2’ (Pushpa 2)  ని థియేటర్లలో వీక్షిస్తున్నప్పుడు ఈ పాట మంచి హై ఇస్తుందని అంతా చెబుతున్నారు. సో రిలీజ్ తర్వాత నార్త్ ఆడియన్స్ ని కూడా ఈ పాట ఒక ఊపు ఊపేసే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus