Devi Sri Prasad: చెన్నై ఈవెంట్లో దేవి కామెంట్స్ పై స్పందించిన ‘పుష్ప 2’ నిర్మాత!

‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఓ ఈవెంట్ జరిగింది. అందులో దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  తన బాధ నంతటిని బయట పెట్టిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 2′ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ ని తప్పించి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ని పెట్టుకోవడం, వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం’ వంటి విషయాలపై దేవి బాగా హర్ట్ అయినట్టు పరోక్షంగా కామెంట్స్ చేశాడు. అసలు విషయం నేరుగా చెప్పకపోయినా.. జనాలకి అర్థమయ్యేలా దేవి కామెంట్లు చేయడం జరిగింది.

Devi Sri Prasad

తాజాగా దేవి కామెంట్స్ పై నిర్మాత మైత్రి రవి స్పందించడం జరిగింది. మైత్రి రవి (Y . Ravi Shankar) మాట్లాడుతూ.. ” దేవి గారు ఏమన్నారు? ‘మా వాళ్ళకి నాపై లవ్వు ఉంటుంది. ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువయ్యాయి’ అన్నారు. అంతే కదా..! అందులో తప్పేముంది సార్? మాకు అయితే ఆయన కామెంట్స్ లో తప్పేమీ అనిపించలేదు. మీరు ఆ ఆర్టికల్.. ఈ ఆర్టికల్ చూసి, ‘బొబ్బిలి పులి’లో డైలాగులాగా ‘తల్లికి, చెల్లికి’ అనే టైపులో ఏదేదో అనేసుకుంటున్నారు.

మేమంతా ఒక ఫ్యామిలీ. అందులో ఎలాంటి సందేహం లేదు. దేవి గారు ఉన్నన్ని రోజులు మాతో సినిమాలు చేస్తారు. మేము ఉన్నన్ని రోజులు ఆయనతో సినిమాలు చేస్తాము” అంటూ చెప్పుకొచ్చారు. రవి మనస్ఫూర్తిగా ఈ కామెంట్స్ చేశారా? లేక కవరింగ్ ఆన్సర్ ఇచ్చారా? అనేది పక్కన పెడితే.. చెన్నై ఈవెంట్లో దేవి శ్రీ ప్రసాద్…” ప్రేమ ఎక్కువ, కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి” అనే మాట మాత్రమే కాదు..

క్రెడిట్ గురించి కూడా మాట్లాడాడు. ‘పేమెంట్ అయినా క్రెడిట్ అయినా అడిగి తీసుకోవాలి. అడిగితేనే ఇస్తారు’ అనే మాట కూడా అన్నాడు. అలాగే ఈవెంట్ కి లేట్ గా వచ్చినందుకు కూడా నిర్మాత రవి ఏదో అన్నట్టు దేవి బహిరంగంగా చెప్పాడు. మరి వాటి గురించి మైత్రి రవి ఎందుకు ప్రస్తావించకుండా? ఆర్టికల్స్ తప్పుగా వచ్చినట్టు చెప్పడం ఎంత వరకు కరెక్ట్? అనేది జనాలకే తెలియాలి.

సమంత వల్ల జరిగిన ట్రోలింగే శ్రీలీలకి ప్లస్ అయ్యిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus