వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కాబోతున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’

ఈ ఏడాది ‘కార్తికేయ2’ ‘ధమాకా’ వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నుండి రాబోతున్న మరో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. యువ కథానాయకుడు నాగశౌర్య, ప్రామిసింగ్ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల వ్యవహరిస్తున్నారు.

నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘ఊహలు గుసగుస లాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక నాగ శౌర్య – మాళవిక నాయర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం కూడా డీసెంట్ హిట్ అనిపించుకుంది. దీంతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. కీలకమైన లండన్ షెడ్యూల్ ను కూడా ఇటీవల ఫినిష్ చేశారు. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇది పూర్తిగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందట. అవసరాల మార్క్ కామెడీ ఈ మూవీలో పుష్కలంగా ఉంటుంది అని సమాచారం. 2023లో వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus