ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ చరిత్రను వక్రీకరించారంటూ పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య ఈ పిల్ ను దాఖలు చేశారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని.. విడుదలపై స్టే విధించాలని ఆమె కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం ముందుకు ఈ పిల్ విచారణకు వచ్చింది.
పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తెలిపింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించబోతున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా.. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. మొదటి నుంచి కూడా ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని రాజమౌళి చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ.. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ పిల్ ను దాఖలు చేశారు.
ముందుగా ఈ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసి.. ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ విషయంలో రాజమౌళి బాధపడుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఇప్పుడేమో ‘ఆర్ఆర్ఆర్’ విడుదలపై స్టే విధించాలంటూ హైకోర్టులో పిల్ వేశారు. మరి దీనిపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!