ఇక్కడ మార్పులు ఎక్కువగానే చేసినట్టున్నారు..!

బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘లస్ట్ స్టోరీస్’ ను తెలుగులోకి కూడా రీమేక్ చెయ్యడానికి లీడింగ్ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ రెడీ అయిన సంగతి తెలిసిందే. నలుగురు మహిళలు వారి తీరని కోరికల కారణంగా తెచ్చుకున్న కష్టాలను అక్కడ ఆవిష్కరించారు. మరి తెలుగులో కూడా అలాగే తీస్తారా అనే చర్చ మొన్నటి వరకూ జరిగింది. అయితే మొదటిగా విడుదల చేసిన టీజర్లో మార్పులు కనిపించాయి. ఇక ఈరోజున ట్రైలర్ ను కూడా విడుదల చేసి దీని పై మరింత క్లారిటీ ఇచ్చారు.

నలుగురి మహిళల జీవితాల్లో… వారు ఫేస్ చేసిన ప్రేమ, సాన్నిహిత్యం, ద్రోహం వంటి భావోద్వేగాలను చాలా ఎమోషనల్ గా ప్రెజెంట్ చేసారని స్పష్టమవుతుంది. టీజర్ చూసిన తరువాత శృతీ హాసన్ లెస్బియన్ పాత్ర పోషిస్తుందా అని డౌట్ పడిన వాళ్లకు అలాంటిదేమి లేదు అని ఈ ట్రైలర్ స్పష్టం చేసింది.అనుమానపు మొగుడు పాత్రలో జగపతి బాబు, నెగిటివ్ టచ్ ఉన్న పొలిటికల్ లీడర్ గా మంచు లక్ష్మి పాత్రలు హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది. యూత్ ను అట్రాక్ట్ చేసే లిప్ లాక్ లు, శృంగార సన్నివేశాలు కూడా ఈ సిరీస్ లో ఎక్కువగానే నింపినట్టున్నారు నలుగురు దర్శకులు.

తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి ఈ సిరీస్ ను తెరకెక్కించారు.ట్రైలర్ మొత్తం బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. శృతీ హాసన్, లక్ష్మీ మంచు,జగపతి బాబు ల తో పాటు ఈషా రెబ్బా, అమలా పాల్, అషిమా నార్వాల్, సత్య దేవ్, శాన్వి మేఘన, సంజిదా హెగ్డే వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :


30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus