భారతీయ సినీ చరిత్రలోనే సంచలనాలు సృష్టించిన సినిమాలలో బాహుబలి1, బాహుబలి2 సినిమాలు ముందువరసలో ఉంటాయి. ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. కమర్షియల్ ప్యాకేజ్ గా జక్కన్న తెరకెక్కించిన బాహుబలి1, బాహుబలి2 పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి2 తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ పై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే బాహుబలి2 కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేస్తుందా? అనే ప్రశ్న సినీ అభిమానుల్లో ఉంది.
Click Here To Watch NEW Trailer
బాహుబలి2 సినిమాకు ఆర్ఆర్ఆర్ కు చాలా తేడాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ లో నాటునాటు సాంగ్ మినహా మరే మాస్ సాంగ్ ఉన్నట్టు ప్రేక్షకులకు అనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయానికి ఓటీటీల హవా కొనసాగుతుంది. నెల, రెండు నెలలు ఎదురుచూస్తే ఓటీటీలో పెద్ద సినిమాలను చూడవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. బాహుబలి2 రిలీజ్ సమయానికి ప్రేక్షకులపై ఓటీటీ ప్రభావం పెద్దగా లేదు. బాహుబలి2 రిలీజ్ సమయంలో చాలా సంవత్సరాలుగా సినిమాలు చూడని ప్రేక్షకులు సైతం థియేటర్లకు కదిలారు.
ఆర్ఆర్ఆర్ కు బాహుబలి2 సినిమాను మించి పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు ఊహించిన రికార్డులు సాధ్యమవుతాయి. ఆర్ఆర్ఆర్ కు ఎన్టీఆర్, చరణ్ క్రేజ్, రాజమౌళి డైరెక్షన్, కళ్లు చెదిరే విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ లు ప్లస్ కానున్నాయి. అదే సమయంలో స్టూడెంట్స్ కు పరీక్షలు ఉండటం, ఐపీఎల్ సీజన్ కావడం, టికెట్ రేట్లు భారీగా ఉండటం, కశ్మీర్ ఫైల్స్ నుంచి గట్టి పోటీ ఉండటం ఈ సినిమాకు మైనస్ అవుతోంది. భారీ మొత్తం చెల్లించి హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లు సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఒకింత టెన్షన్ పడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. అసమానమైన టాక్ ఈ సినిమాకు వస్తే మాత్రమే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!