పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన ‘బ్రో’ సినిమా జూలై 28 న విడుదల కాబోతోంది. ఇందులో కాలం రూపం ధరించుకొని వస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ అలా కనిపించబోతున్నారు.తమిళంలో హిట్టైన ‘వినోదయ సీతమ్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రెండు మూడు బిట్ సాంగ్స్ పెండింగ్ లో ఉన్నాయని తమన్ ఇటీవల తెలిపాడు.
వాటి మిక్సింగ్ వర్క్ తప్ప షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఏపీలో అధికార పార్టీ ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించేసి ఓపెనింగ్స్ పై దెబ్బ కొట్టడం జగన్ ప్రభుత్వానికి అలవాటు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరఫున వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా పలు చోట్ల పవన్ చేసిన కామెంట్స్ అధికారిక పార్టీలో సెగలు పుట్టిస్తోంది అని చెప్పాలి. అందుకే ‘బ్రో’ సినిమా టికెట్ రేట్ల పెంపు అనేది ఉండదు. ఇంకా తగ్గించేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలు ఉండవు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ‘బ్రో’ కి ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు.
ఓపెనింగ్స్ పై దెబ్బ పడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు.? పవన్ కళ్యాణ్ వల్ల సినీ పరిశ్రమను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది జగన్ ప్రభుత్వం. వచ్చే ఏడాది ప్రభుత్వం మారకపోతే పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాకుండా సినీ పరిశ్రమకి మరిన్ని కష్టాలు తప్పవనే అభిప్రాయాలూ వినిపిస్తూనే ఉన్నాయి.