‘దర్బార్’ లో డైలాగ్.. శశికళని ఉద్దేశించేనా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాకి హిట్ టాక్ రావడం ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో ఓ డైలాగ్ శశికళని ఉద్దేశించినట్లుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమెని కించపరిచినట్లుగా ఉన్న ఆ సంభాషణని తొలగించాలని ఆమె తరఫు న్యాయవాది డిమాండ్ చేస్తున్నారు.ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు.

అయితే ఒక సన్నివేశంలో జైలులో ఖైదీ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. అదే సమయంలో డబ్బులుంటే ఖైదీలు షాపింగ్‌ కూడా వెళ్లొచ్చన్న డైలాగ్‌ ఉంది. ఈ సీన్ లో ఎక్కడా శశికళ పేరు ప్రస్తావించలేదు. కానీ అది శశికళని ఉద్దేశించి పెట్టిన డైలాగ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో ఆ డైలాగ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus