Kollywood: మనలాగే అక్కడా పొంగల్‌ ఫైట్‌ తేలడం లేదు.. మనకూ ఇబ్బందే!

  • October 22, 2024 / 06:03 PM IST

సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్‌లో వచ్చే సినిమాల లిస్ట్‌ తేలడంలో కోలీవుడ్ పాత్ర ఉంటుందా? ఈ ప్రశ్నకు కచ్చితంగా ఉంటుంది అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే కోలీవుడ్‌లో పొంగల్‌ సీజన్‌కి పెద్ద పెద్ద సినిమాలు వస్తుంటాయి. అవి ఆటోమేటిగ్గా తెలుగులో కూడా వస్తుంటాయి. ఈ క్రమంలో మన సినిమాల విషయంలో చర్చ తేలేముందు కోలీవుడ్‌ (Kollywood) సినిమాల సంగతి తేలుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి మనలాగే తేలడం లేదు.

Kollywood

వచ్చే ఏడాది సంక్రాంతికి కోలీవుడ్ (Kollywood) పరిస్థితి చూస్తే తొలుత వినిపించే పేర్లు ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’, ‘విదామయూర్చి’. ఈ రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇందులో ‘గుడ్‌ బ్యాగ్‌ అగ్లీ’ సినిమాను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సంక్రాంతికి తీసుకురావాలని చూస్తోంది. ‘విదాముయార్చి’ టీమ్‌ కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కార్తి (Karthi) – నలన్‌ కుమారస్వామి తెరకెక్కించిన ‘వా వాతియారే’ కూడా సంక్రాంతి పోరుకు సిద్ధమవుతోంది.

ఇటీవల ‘తంగలాన్‌’ (Thangalaan) సినిమాతో మంచి విజయం అందుకున్న విక్రమ్‌ (Vikram) కూడా పొంగల్‌ ఫైట్‌లో ఉన్నారు అంటున్నారు. ఆ సినిమానే ‘వీర ధీర శూరన్‌ 2’. అయితే వీటిలో తెలుగులోకి వచ్చే సినిమాల లిస్ట్‌ చూస్తే తొలుతగా మైత్రీ మూవీ మేకర్స్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ కచ్చితంగా వస్తుంది. మిగిలిన రెండు సినిమాల సంగతి తేలాలి. లెక్క ప్రకారం చూస్తే మూడు సినిమాలూ మన దగ్గర పొంగల్‌ బరిలోకి దిగుతాయి. ఇక తెలుగు సంగతి చూస్తే..

రామ్‌చరణ్‌ (Ram Charan) – శంకర్‌ (Shankar) ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  ఇటీవల ఫిక్స్‌ అయింది. బాలకృష్ణ (Balakrishna) – బాబీ (K. S. Ravindra) సినిమా కూడా సంక్రాంతి టార్గెట్‌గానే సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు ఉంటాయి అంటున్నారు. ‘తండేల్‌’ (Thandel) ఒకటి కాగా.. సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ‘మాజాకా’ కూడా సంక్రాంతి రేసులోనే ఉన్నాయి. మరి వీటిలో ఏది ఫైనల్‌ అవుతాయి అనేది చూడాలి. ఏదైతే అదైంది.. అన్నీ వచ్చి బాగుంటే చూడటానికి మన జనాలు రెడీ.

కమెడియన్‌ను డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. మొన్న పవన్‌ పొగినోడే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus