వచ్చే సంక్రాంతి వార్‌… మామూలుగా లేదు.. ఎవరు ఫైనల్‌ అవుతారో?

సంక్రాంతి సినిమాలివే… ఈ మాట అనుకున్న ప్రతిసారి ‘అవునా నిజమా నాకు డౌటే’ అనుకునేవారా? అయితే ఇప్పుడు ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల లిస్ట్‌ మారిపోయింది. ఈసారి కొత్త సినిమాలు పుట్టుకురాలేదు. అలా అని తర్వాత వస్తామని చెప్పిన సినిమాలు వెనక్కి రాలేదు. మరో పెద్ద సినిమా డిసెంబరు ఆఖరకు రావడమే కారణం. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది ఆ సినిమా ఏంటో. అదే డైనోసార్‌ అలియాస్‌ ‘సలార్‌’.

సెప్టెంబరు 29న రావాల్సిన ‘సలార్’ సినిమా డిసెంబరు 22కు వాయిదా పడింది. దీంతో ఆ వారంలో సినిమాలు విడుదల చేద్దాం అనుకున్నవాళ్లు కొత్త తేదీలు వెతుక్కోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ అగ్ర హీరో సినిమా సంక్రాంతి బరిలోకి వస్తోంది అని సమాచారం. దీంతో సంక్రాంతి సినిమా వార్‌ మళ్లీ మారిపోయింది అని చెప్పాలి. అలా మారుతున్న సినిమా వెంకటేశ్‌ ‘సైంధవ్‌’. ఈ విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ.. మారడం మాత్రం పక్కా అంటున్నారు.

2024 సంక్రాంతి సీజన్‌ ఈసారి మామూలుగా ఉండదు అని 2023 మిడిల్‌లోనే అర్థమైపోయింది. దానికి కారణం అక్కడ రెడీగా ఉన్న సినిమాలే. మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’ సంక్రాంతికే రిలీజ్‌ చేస్తామని చెప్పారు. ఒకసారి కూడా కాదు, రెండు మూడుసార్లు ఇదే మాట చెప్పారు. ఇక నాగార్జున 99వ సినిమా ‘నా సామిరంగా’ పొంగల్‌ ఫైట్‌లో ఉందని చెప్పేశారు. ఇక తేజ సజ్జా – ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘హను – మాన్‌’ సినిమాను కూడా అప్పుడే రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు.

ఇది కాకుండా విజయ్‌ దేవరకొండ – దిల్‌ రాజు సినిమా కూడా ముగ్గుల పండగకు వస్తుంది. మొన్నీమధ్యే రవితేజ కూడా తన ‘ఈగిల్‌’ సినిమాను జనవరి 12న రిలీజ్‌ చేస్తామని చెప్పేశాడు. అయితే ఈ పోరులో వెంకటేశ్‌ – శైలేష్‌ కొలను ‘సైంధవ్‌’ను తీసుకొస్తున్నారట. డిసెంబరు 22 సింగిల్‌ సినిమాతో ప్యాకప్‌ అవ్వడంతో సంక్రాంతి డేట్‌ తీసుకున్నారు అంటున్నారు. అయితే ఇన్ని సినిమాలకు డేట్స్‌ అడ్జెస్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇందులో చాలా సినిమాలు (Movies) డ్రాప్‌ అవుతాయి అనేది పక్కా. అయితే ఆ సినిమాలేవీ అనేది ఇక్కడ విషయం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus